120 కిలోల హెరాయిన్ స్వాధీనం

120 కిలోల హెరాయిన్ స్వాధీనం

గుజరాత్ లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ద్వారకా జిల్లాలోని మోర్బి సమీపంలోని జింజుడాలో 120 కిలోల హెరాయిన్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.  లోకల్ పోలీసులతో కలిసి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ కోట్లలో ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 600 కోట్లు ఉంటుందన్నారు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా. హెరాయిన్ ను పాకిస్థాన్ నుంచి పడవలో తీసుకొచ్చారని చెప్పారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా గుజరాత్ పోలీసుల్ని అభనందించారు ఆ రాష్ట్ర హోం మంత్రి హర్ష సంఘ్వి. 

‘ గుజరాత్ పోలీసుల మరో ఘనత. డ్రగ్స్ నిర్మూలనలో గుజరాత్ పోలీసులు ముందున్నారన్నారు. గుజరాత్ ఏటీఎస్ దాదాపు 120 కిలోల డ్రగ్స్‌ని పట్టుకుంది’’ అని మంత్రి ట్వీట్ చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలియజేస్తారన్నారు మంత్రి.