కరోనా సోకకుండా ఉండేందుకు మాస్క్ ధరించడంతో పాటు...భౌతిక దూరం పాటించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఆరోగ్య శాఖ అధికారులు కూడా కట్టు దిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించని వారికి ఫైన్లు కూడా విధిస్తున్నారు. అయినా కొందరు పట్టనట్లు వ్యవహరిస్తూ..తోటి వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. మాస్క్ పెట్టుకో అన్నందుకు.. ఊబెర్ డ్రైవర్ మొహంపై దగ్గింది ఓ ప్రయాణికురాలు. ఈ ఘటన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. బెర్ అండ్ లిఫ్ట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న శుభకర్ ఆర్డర్ మేరకు ముగ్గురు మహిళలను పిక్అప్ చేసుకున్నాడు. అయితే వారికి మాస్కు లేకపోవడంతో పెట్టుకోవాలని సూచించాడు. వారిదగ్గర మాస్కులు లేకపోవడంతో కారును పెట్రోల్ బంక్ దగ్గర ఆపి మాస్కులు ధరించాలని కోరాడు. అందులో ఒకరు మాస్కు కోసం వెళ్లగా మరో యువతి మాత్రం డ్రైవర్ తో గొడవకు దిగింది. శుభకర్ ని పై విరుచుకుపడింది. అంతేకాదు డ్రైవర్ పై దగ్గింది. మాకు కరోనా ఉంది ఇప్పుడు.. ఏం చేస్తావ్ అంటూ గొడవకు దిగింది.ఇదంతా మరో మహిళా తన సెల్ ఫోన్ రికార్డ్ చేసింది. మహిళల అనుచిత ప్రవర్తనతో విసిగిపోయిన డ్రైవర్ ఇంతటితో డ్రైవింగ్ ఎండ్ చేస్తున్నాని... కారు నుంచి దిగిపోవాలన్నాడు. దానికి వారు నిరాకరించి మంరిత హంగామా సృష్టించారు.అంతే కాదు శభకర్ కళ్లలో ఓ స్ప్రే ను చల్లి వెళ్లారు. దీంతో ఊపిరాడక అతడు ఇబ్బంది పడ్డాడు. ఆ స్ప్ర్రే తో కారు పాడైందన్నాడు. ఈ ఘటనంతా కారు కెమెరాలో రికార్డ్ కావడంతో అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దీనిపై స్పందించిన ఆ యువతీ అతడు కేవలం క్రాప్ చేసిన 40 సెకన్ల వీడియోనే ఎందుకు న్యూస్ చానెళ్లకు ఇచ్చాడో గుర్తించాలని కోరింది. తాను గొడవకు ముందు జరిగిన విషయాలను చెప్పలేదని చెప్పింది.
