ఏపీకి మరో తుఫాను హెచ్చరిక : వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ప్రభావం పొంచి ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం.. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది. అక్టోబర్ 23న (నేడు) తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 40- నుంచి 60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన IMD తెలిపింది.