కరోనా వైరన్ ను కట్టడి చేసేపనిలో భాగంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వరంగ సంస్థ BSNL తమ కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ల్యాండ్ లైన్ ద్వారా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న వినియోగదారుల కోసం బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. లేటెస్టుగా లాక్‌డౌన్ సమయంలో మొబైల్ సబ్‌స్కైబర్స్‌కు వెసులుబాటు కలిగించేలా ఒక ప్రకటన చేసింది. ఫ్రీగా వ్యాలిడిటీని పొడగించడంతోపాటు, టాక్ టైమ్‌ను కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. లాక్ డౌన్ సమయంలో రీచార్జ్ చేసుకోవడం కుదరని వారికి ఇది ఉపయోగపడుతుందని చెప్పింది.
ఇందులో భాగంగా మర్చి 20 తర్వాత వ్యాలిడిటీ అయిపోయిన మొబైల్ వినియోగదారులకు ఏప్రిల్ 20 వరకు ఉచితంగా వ్యాలిడిటీని పొడిగించనున్నట్టు ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్ కాలంలో వినియోగదారుల బ్యాలెన్స్ జీరోకు చేరితే.. వారికి 10 రూపాయల ఉచిత టాక్‌టైమ్ అందించనున్నట్టు తెలిపింది BSNL.
