తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోనూ నిత్యాన్నదానాన్ని 2024 ఫిబ్రవరి 29న ప్రారంభించింది. ఈ మేరకు అన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రారంభించారు. భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన ప్రసాదం అందిస్తారు. ఈరోజు(2024 ఫిబ్రవరి 29) నుంచి ప్రతి రోజు రెండువేల మంది భక్తులకు సరిపడేలా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ALSO READ :- కిషన్, అయ్యర్ లపై కఠిన చర్యలు..బీసీసీఐపై అభిమానులు ఫైర్
తిరుమలలో లక్ష మందికిపైగా భక్తులకు టీటీడీ అన్నప్రసాదం అందిస్తోంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గతంలో తాను టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు .. ప్రతి భక్తుడూ అన్నదానంలో భోజనం చేసే ఏర్పుటు చేశామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.