Vijay Hazare Trophy: అన్మోల్‌ప్రీత్ సింగ్ వీర విధ్వంసం.. 35 బంతుల్లో సెంచరీతో సరికొత్త రికార్డ్

ఐపీఎల్ లో భారత యువ క్రికెటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ కు నిరాశే మిగిలింది. ఐపీఎల్ లో ఏ జట్టు కూడా అతన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్లేయర్ 35 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ కు చెందిన ఈ యువ క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. 35 బంతుల్లో సెంచరీ చేసి లిస్ట్ ఎ క్రికెట్‌లో బంతుల పరంగా  వేగవంతమైన వేగవంతమైన సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు.

2019 లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డ్ అన్మోల్‌ప్రీత్ సింగ్ బ్రేక్ చేశాడు. క్రికెట్ చరిత్రలో మూడో  ఫాస్టెస్ట్ లిస్ట్-ఎ సెంచరీగా నిలిచింది. ఓవరాల్ గా ఈ రికార్డ్ ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ పేరిట ఉంది. ఈ ఆసీస్ యువ బ్యాటర్ కేవలం 29 బంతుల్లోనే సెంచరీ చేశాడు. శనివారం (డిసెంబర్ 21) అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసిన ఈ పంజాబ్ బ్యాటర్.. ఓవరాల్ గా 45 బంతుల్లో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.

ALSO READ | IND vs PAK: బోర్డర్‌లో స్టేడియం కట్టండి.. ఛాంపియన్స్ ట్రోఫీపై షెహజాద్ వింత సలహా

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్‌తో 164 పరుగులకే ఆలౌట్ అయింది. 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ అన్మోల్‌ప్రీత్ సింగ్ ధాటికి కేవలం 12.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.