హైకోర్టులో పిన్నెల్లికి ఊరట...ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు...

ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.పల్నాడు జిల్లాలోని ఓ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం ధ్వంసం చేయటంతో పిన్నెల్లిపై కేసు నమోదయ్యింది. అయితే, ఈ  కేసు విషయంలో జూన్ 6వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది కోర్టు. ఈవీఎం ధ్వంసం కేసుతో సహా పిన్నెళ్లిపై నమోదైన మరో రెండు కేసుల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పిన్నెల్లి.

పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు ఆయనపై జూన్ 6వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. అయితే, ఈవీఎం ధ్వంసం కేసులో వర్తించే షరతులు ఈ కేసుల్లో కేసుల వర్తిస్తాయని తెలిపింది హైకోర్టు.