అంగన్ వాడీలను సమర్థవంతంగా నిర్వహించాలి : అనితారామచంద్రన్​

మిర్యాలగూడ, వెలుగు : అంగన్ వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపురం, సుభాష్ నగర్–-2 అంగన్ వాడీ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 సెంటర్లలో ఫ్రీ స్కూల్ కిట్,  స్టోరీ బుక్స్, మ్యానువల్, టీచర్స్ యాప్ లోని హాజరు శాతాన్ని పరిశీలించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన  బియ్యం, పాలు, నూనె, పప్పు, బాలామృతాన్ని చెక్ చేశారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, తహసీల్దార్ హరిబాబు, మిర్యాలగూడ సీడీపీవో మమత, సెక్టార్ సూపర్ వైజర్లు ఉన్నారు.