కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లేటెస్టుగా ఏర్పాటు జరిపిన మంత్రివర్గ విస్తరణలో అనితా ఇందిరా ఆనంద్ స్థానం దక్కించుకున్నారు. కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న మొదటి హిందూ మహిళా మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ఇటీవల ఆమె పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అక్టోబర్‌లో జరిగిన హౌస్ ఆఫ్ కామన్స్ సభకు ఆమె అర్హత సాధించారు. అలాగే తొలి హిందూ పార్లమెంటేరియన్‌గా కూడా అనిత ప్రత్యేక గుర్తింపును పొందారు. టొరంటోలోని ఓ ప్రముఖ వర్శిటీలో న్యాయశాస్త్ర అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. తొలిసారి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అనిత తల్లిదండ్రులు భారత్‌కు చెందిన వారు. నూతన వర్గంలో మరో ముగ్గురు కొత్త వారికి కూడా ట్రూడో చోటుకల్పించారు. వీరంతా ఇండో-కెడియన్‌కు చెందిన సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారు.
