మర్రిగూడ మండలంలో .. పశు వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన పశుసంవర్ధక శాఖ అధికారి

చండూరు ( మర్రిగూడ) వెలుగు: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని పశువైద్యశాలను జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఖాద్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.   వైద్య సేవలు, మందుల రికార్డులను పరిశీలించారు  పశు వైద్యశాలకు  క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని ఆదేశించారు.

హాస్పిటల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని,ఎప్పుడు పాడి రైతులకు అందుబాటులో ఉండి పాడి పశువుల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించి వైద్య సేవలు అందించాలని సూచించారు. డాక్టర్ పి.సురేందర్,వెటర్నరీ అసిస్టెంట్ ఎల్లేష్ ఉన్నారు.