పక్కదారి పడుతున్న అంగన్ వాడీ సరుకులు

టేక్మాల్, వెలుగు: మెదక్​జిల్లా టేక్మాల్​మండలంలోని హసన్ మహమ్మద్ పల్లి తండాలో అంగన్వాడీ సరుకులు పక్కదారి పట్టిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. తండాకు చెందిన అంగన్ వాడీ టీచర్ అల్లుడి కారులో పిల్లలకు అందించే గుడ్లు, పాల పదార్థాలు, కందిపప్పు తరలిస్తుండగా తండా వాసులు  పట్టుకున్నారు. 

ఈ సంఘటనపై సూపర్ వైజర్ శ్రీశైలమ్మ వివరణ కోసం ఫోన్ చేయగా ఆమె భర్త ఫోన్ లిఫ్ట్ చేసి మేడం అందుబాటులో లేరని సమాధానం ఇచ్చారు.