Paris Masters 2024: ఇంత పిచ్చి కోపం ఏంటి..? ఓడిపోతున్నాడని రక్తం వచ్చేలా కొట్టుకున్నాడు

పారిస్ మాస్టర్స్ లో ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ బిగ్ షాక్ తగిలింది. అతను రౌండ్ ఆఫ్ 32 లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అర్జెంటీనా ప్రత్యర్థి ఫ్రాన్సిస్కో సెరుండోలోతో జరిగిన మ్యాచ్ లో 7-6 (8-6) 7-6 (7-5) తేడాతో ఓడిపోవడంతో నిరాశకు గురయ్యాడు. గెలిచే మ్యాచ్ ను ఈజీగా చేజార్చుకున్నాడు. దీంతో రుబ్లెవ్.. కోపం హద్దులు దాటింది. 

ALSO READ | ప్రొ కబడ్డీ లీగ్‌‌లో .. బెంగళూరుకు తొలి విజయం

తొలి సెట్ లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి రుబ్లెవ్ 5-2 ఆధిక్యం సంపాదించాడు. ఈ దశలో సెరుండోలో రెండు సార్లు సర్వీస్ బ్రేక్ చేసి 6-5 ఆధిక్యంలోకి వెళ్ళాడు. సెట్ టై బ్రేక్ కు వెళ్లగా.. సెరుండోలో ఉత్కంఠ విజయం సాధించాడు. రెండో సెట్ లోనూ 4-2 ఆధిక్యంలోకి వెళ్ళాడు రుబ్లెవ్. అయితే మరోసారి సెరుండోలో స్కోర్ ను సమం చేశాడు. దీంతో రుబ్లెవ్ సహనం కోల్పోయాడు. రాకెట్ తో మోకాలికేసి బలంగా కొట్టుకున్నాడు. ఎంతలా అంటే అతని మోకాలి వెనక భాగంలో రక్తం కూడా వచ్చింది. దీంతో కోర్ట్ లో ప్లేయర్లు అందరూ షాక్ అయ్యారు.