ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 58,519 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 326 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ గా నిర్థారణ అయ్యిందని తెలిపింది వైద్యారోగ్యశాఖ. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,82,612కు చేరిందని..  గడిచిన 24 గంటల్లో ఏటువంటి మరణాలు సంభవించలేదని చెప్పింది. ఇప్పటివరకు కరోనాతో 7108 మంది మృతి చెందారని.. గత 24 గంటల్లో కరోనా నుంచి 350 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు మొత్తంగా 8,72,266 మంది కోలుకున్నారని తెలిపింది.  ఏపీలో ప్రస్తుతం 3,238 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,18,84,085 శాంపిల్స్‌ను పరీక్షించామని.. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.