ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు రిలీజ్ చేశారు. మొత్తం ఈ సంవత్సరం 9.99 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. ఫస్టియర్ లో 67 శాతం, సెకండియర్ లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ లో 71శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి కూడా బాలికలదే పై చేయి సాధించారు.
ఫస్టియర్ లో అబ్బాయిలు 64 శాతం ఉత్తీర్ణత సాధించగా అమ్మాయిలు 71 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ లో 81 శాతం అమ్మాయిలు, 75 శాతం అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ కృష్ణా జిల్లా టాప్ లో నిలిచింది. సెకండియర్ లో గుంటూరు టాప్ లో స్థానంలో నిలిచింది.
2024 మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. త్వరలో షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ఇంటర్ బోర్టు తెలిపింది.