అమిత్ షాతో ప‌వ‌న్ భేటీ

  • రాష్ట్రంలోని తాజా పరిణామాల‌పై చ‌ర్చ 

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీ చేరుకున్న ప‌వ‌న్.. అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఏపీలో ఇటీవ‌ల చోటుచేసుకున్న తాజా పరిణామాల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. కూట‌మి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఐదు నెల‌లు కావొస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. 

తిరుమల తిరుపతి ల‌డ్డూతో మొద‌లైన వివాదాన్ని.. స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్షణ వ‌ర‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ తీసుకెళ్లారు. అంతకు ముందు ఏపీ భవన్ లో పవన్ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం అయిన త‌రువాత తొలిసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను క‌లుస్తున్నట్టు చెప్పారు. ఇది మ‌ర్యాద‌పూర్వక భేటీ మాత్రమేనని తెలిపారు.