మహిళా భక్తురాల్ని వీపు ఎక్కించుకొని 6కిలోమీటర్లు మోసిన కానిస్టేబుల్

మహిళా భక్తురాల్ని వీపు ఎక్కించుకొని 6కిలోమీటర్లు మోసిన కానిస్టేబుల్
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ మహిళా భక్తురాల్ని కానిస్టేబుల్ తన భుజాలపై  కూర్చొబెట్టుకొని సుమారు 6కిలోమీటర్లు మోసి గమ్యస్థానానికి చేర్చాడు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరుమలలో స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్  షైక్ అర్షద్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆకేపాడుకు చెందిన మంగి నాగేశ్వరమ్మ తో పాటు  తిరుమల కొండ ఎక్కే సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ అర్షద్ నాగేశ్వరమ్మను అత్యవసర చికిత్స కోసం మెడికల్ క్యాంప్ కు తరలించారు. సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెడికల్ క్యాంప్ కు హర్షద్ సదరు మహిళను వీపుపై ఎక్కించుకున్నాడు. ప్రస్తుతం అర్షద్ సాహసంపై  ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం ప్రశంసించింది.