RTGS, NEFT సిస్టమ్‌‌లపై ఛార్జీలు రద్దు

RTGS, NEFT సిస్టమ్‌‌లపై ఛార్జీలు రద్దు

జూలై 1 నుంచి అమలు.. ఆంధ్రాబ్యాంక్

ఆర్‌‌‌‌టీజీఎస్, నెఫ్ట్ సిస్టమ్‌‌ల ద్వారా చేపడుతోన్న లావాదేవీలపై ఆర్‌‌‌‌బీఐ  బ్యాంక్‌‌లపై విధిస్తోన్న ఛార్జీలు 2019 జూలై 1 నుంచి రద్దు అవుతున్నాయి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ఆర్‌‌‌‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రయోజనాలను ఆర్‌‌‌‌టీజీఎస్, నెఫ్ట్‌‌ సిస్టమ్‌‌ల ద్వారా లావాదేవీలు జరిపే తమ కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని ఆంధ్రా బ్యాంక్ తెలిపింది. చార్జీల రద్దు జూలై 1, 2019 నుంచి అమలు లోకి  వస్తోందని ఆంధ్రా బ్యాంక్ పేర్కొంది.