నాగపురి ఉన్నత పాఠశాలను సందర్శించిన అందెశ్రీ

చేర్యాల, వెలుగు: జయ జయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ గురువారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి హైస్కూల్​ను సందర్శించారు.   ఈ సందర్భంగా ఆయన  విద్యార్థులతో మాట్లాడారు. కులమత బేధాలకు అతీతంగా  జీవించాలన్నారు.   తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని, సమాజాన్ని అర్థం చేసుకోవాలని,  చదువును మించిన సంపద ఈ సృష్టిలో లేదన్నారు.  

అనంతరం టీచర్లు అందెశ్రీని సన్మానించారు. హెచ్​ఎం ఎలికట్టె అయిలయ్య ,   ఉపాధ్యక్షుడుకృష్ణమూర్తి, పద్మ, విజయ్​కుమార్​, మనోజ్​ కుమార్​, ప్రకాశ్​ ​రెడ్డి, యాదగిరి, స్వర్ణకుమార్ పాల్గొన్నారు.