దేశంలోనే ప్రముఖ వ్యాపార దిగ్గజం, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా బిజినెస్ లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. పలు ఆసక్తికర ట్వీట్లు చేయడంతో పాటు వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వాటికి లక్షల్లో వ్యూస్, కామెంట్స్ రావడం కూడా పాత విషయమే. అయితే తాజాగా అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోను ఒకదాన్ని ఆనంద్ మహీంద్రా షేర్ చేశాడు. ఈ వీడియోలో కనిపిస్తున్న కేఫ్ కశ్మీర్ లోని గురేజ్ వ్యాలీలో ఉందన్న ఆయన.. దీన్ని ఇండియన్ ఆర్మీ నడిపిస్తోందని చెప్పుకొచ్చారు. దీని పేరు లాగ్ హాట్ కేఫ్ అని, గరిమా గోయెల్ అనే మహిళ ఈ కేఫ్ టూర్ వీడియో చేసిందని తెలిపారు. అయితే దీంట్లో కేఫ్ వాతావరణం, అలంకరణ, మెనూను వివరించిన గరిమా... వీడియో చివరలో భారత సైన్యానికి మద్దతుగా అందరూ ఈ కేఫ్‌ను సందర్శించాలని కోరింది. మనసును ఆహ్లాదాన్ని కలిగించే ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకోవడంతో.. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. ఈ కేఫ్ 5 స్టార్ కాదు, 7 స్టార్ కాదు.. 10 స్టార్ డెస్టినేషన్ అని ట్యాగ్‌లైన్ ను జత చేశారు. అంతే కాదు తనకు వీలున్నప్పుడు తప్పకుండా ఈ కేఫ్‌ను సందర్శిస్తానని తెలిపారు.
As far as I’m concerned, this Cafe is not a 5 star, nor a 7 star, but a 10 star destination! pic.twitter.com/oQZvEOanlT
— anand mahindra (@anandmahindra) June 11, 2022
