30 ఏళ్లు కష్టపడి కొండను తొవ్విన వ్యక్తికి ఆనంద్‌ మహింద్రా గిఫ్ట్

30 ఏళ్లు కష్టపడి కొండను తొవ్విన వ్యక్తికి ఆనంద్‌ మహింద్రా గిఫ్ట్

బీహార్ మౌంటెన్ మ్యాన్ లౌంగీ బూయియాకి మహింద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా బహుమానంగా ట్రాక్టర్ ను అందించారు.

బిహార్ రాష్ట్రం గయా జిల్లాలోని బాంకేబజార్ బ్లాక్‌ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడతారు. నీటి సౌకర్యం లేకపోవడంతో వరి, గోధుమ పంటలు పండించే పరిస్థితులు లేవు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన యువత ఉపాధి కోసం గ్రామాల్ని వదిలి పట్టణాలకు వలసవెళుతుండేవారు.

అయితే కోటిల్వా గ్రామంలో నివసించే లౌంగీ బూయియా కుమారులు సైతం ఉపాధి కోసం వలస వెళ్లారు. మేకలు మేపుకునే లౌంగీ బూయియాకి ఓ ఆలోచన వచ్చింది. గ్రామానికి నీటీ సౌకర్యాన్ని కల్పిస్తే తన కొడుకులా ఎవరూ ఉపాధి కోసం గ్రామాల్ని వదిలి వలస వెళ్లిపోకుండా ఉంటారని అనుకున్నారు.

అనుకున్న ప్రకారం..ముందుగా గ్రామానికి నీరు ఎలా వస్తుంది..? నీరు రావాలంటే ఏం చేయాలి..? ఏం చేస్తే నీరు గ్రామాలకు వస్తుందో ఆలోచించారు.

గ్రామానికి సమీపంలో ఓ కొండ ఉంది. వర్షాల నీరు ఆ కొండపైనే నిలిచిపోతుందే తప్ప కిందకి రావడం లేదు. దీంతో ఆ కొండపై నీరు కిందకి వచ్చేలా చేస్తే నీటీ సమస్య తీరిపోతుందని అనుకున్నారు.

అనుకున్నట్లు కాల్వను తొవ్వేందుకు ఓ మ్యాప్ గీసుకొని కొండ నుంచి గ్రామానికి ఓ కాల్వాను తవ్వారు. అలా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఏకంగా 30ఏళ్ల పాటు ఒక్కడే తవ్వాడు.

ఆగస్ట్ నెలలో ఈ కాల్వ పూర్తయి. చుట్టుపక్కన ఉన్న మూడు గ్రామాలకు పుష్కలంగా నీటి సదుపాయం ఉంది. దీంతో వలస వెళ్లిన ప్రజలు తిరిగి స్వగ్రామానికి చేరుకుంటున్నట్లు లౌంగీ బూయియా తెలిపారు. మేకలు మేపుకుంటూ వీలుకుదిరినప్పుడల్లా కాల్వ తొవ్వునట్లు లౌంగీ బూయియా చెప్పారు. లౌంగీ బూయియా తవ్విన కాల్వ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మహింద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా..,లౌంగీ బూయియా పై స్పందించారు. ఊరి బాగుకోసం 30 ఏళ్లు కష్టపడి నీటి కాలువ తవ్విన లంగీ భుయాన్‌పై ఆనంద్‌ మహింద్రా ప్రశంసలు కురిపించారు. భుయాన్‌ తవ్విన కాలువ పిరమిడ్స్‌, తాజ్‌మహల్‌ వంటిదని అన్నారు. ఆయన కృషికి చిరు బహుమానంగా ట్రాక్టర్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

తాజాగా మహింద్రా గ్రూప్ ఉద్యోగులు బీహార్ మౌంటెన్ మ్యాన్ లౌంగీ బూయియాకి ట్రాక్టర్ ను అందించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.