ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ కార్లు తయారు చేయడంలో ప్రసిద్ధి పొందింది. కార్ల కంపెనీల్లో ఈ సంస్థకు చాలా పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. అయితే టెస్లా కార్లను మించిన ఓ కారును తాను కనుగొన్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తెలిపారు. టెస్లా కార్లను మించిన కారు అంటే ఏదోనని అనుకోకండి. అదో దేశీ వాహనం. ఎడ్ల బండిని కారుగా మలిచిన వాహనమది. కారును పోలిన ఈ ఎడ్ల బండి వీడియోను ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకున్నారు.
I don’t think @elonmusk & Tesla can match the low cost of this renewable energy-fuelled car. Not sure about the emissions level, though, if you take methane into account… pic.twitter.com/C7QzbEOGys
— anand mahindra (@anandmahindra) December 23, 2020
ఈ వీడియోలో కారును పోలి ఉన్న ఎడ్ల బండి ముందు వైపు, వెనుక వైపు కారు లాంటి నిర్మాణం ఉంది. ముందు భాగంలోని సీటుపై వ్యక్తి కూర్చొని ఎడ్లను, బండిని అదుపు చేస్తూండగా.. వెనుక వైపు ఖాళీ సోఫా ఉంది. ‘తక్కువ ధరలో పునరుత్పాదక శక్తితో నడిచే ఈ కారుకు.. ఎలన్ మస్క్ సంస్థ అయిన టెస్లా పోటీనివ్వలేదని అనుకుంటున్నా. మీథేన్‌ను లెక్కలోకి తీసుకుంటే.. ఉద్గారాల స్థాయి ఎంతో చెప్పలేం’ అని ఆనంద్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది.
