రూపాయి మరింత పడొచ్చు! మార్చి నుంచి రికవరీకి ఛాన్స్‌ 

రూపాయి మరింత పడొచ్చు!  మార్చి నుంచి రికవరీకి ఛాన్స్‌ 

న్యూఢిల్లీ: రూపాయి విలువ గత 10 నెలల నుంచి  తగ్గుతూనే ఉంది. డాలర్ మారకంలో ఈ ఏడాది జనవరిలో 74 పలికిన రూపాయి, కిందటి వారం 83 కి పడిపోయింది. అంటే ఈ పది నెలల్లోనే  10 శాతానికి పైగా తగ్గింది.  దేశ ఎకానమీకి పడుతున్న రూపాయి మంచిది కాదు.  డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత తగ్గుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కొంత మంది అయితే రూపాయి విలువ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే రికవరీ అవుతుందని అంటున్నారు. రూపాయి విలువ పడడానికి ప్రధాన కారణం గ్లోబల్ అంశాలే అని చెప్పొచ్చు. ఈ ఏడాది డాలర్ విలువ మేజర్ కరెన్సీలతో పోలిస్తే షార్ప్‌‌‌‌‌‌‌‌‌‌గా పెరిగింది. పౌండ్‌‌‌‌, యూరో వంటి పెద్ద కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకంలో రూపాయి మంచి పెర్ఫార్మెన్స్‌‌‌‌ చేసినప్పటికీ,  రూపాయి పతనాన్ని మాత్రం లైట్‌‌‌‌గా తీసుకోలేమని ఎనలిస్టులు అన్నారు. డాలర్ వాల్యూ పెరిగితే దేశ దిగుమతులు ఖరీదవుతాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ  మరికొంత కాలం పాటు పడుతుందని డెలాయిట్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ రుమ్కీ మంజుందార్‌‌‌‌‌‌‌‌ అన్నారు.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలో రూపాయి విలువ తిరిగి పెరుగుతుందని అంచనా వేశారు. యూరప్‌‌‌‌లో ఎనర్జీ సంక్షోభం, యూఎస్‌‌‌‌, చైనాలలో స్లోడౌన్‌‌‌‌కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉందని వివరించారు.  ‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో డాలర్ మారకంలో రూపాయి విలువ తిరిగి 77–79 రేంజ్‌‌‌‌కు బలపడుతుందని అంచనావేస్తున్నాం’ అని ఆమె అంచనావేశారు.  రూపాయి విలువ సడెన్‌‌‌‌గా, షార్ప్‌‌‌‌గా తగ్గొచ్చని మహీంద్రా గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ సచ్చిదానంద్‌‌‌‌ శుక్లా అన్నారు.  నవంబర్–మార్చి మధ్య రూపాయి విలువ 85 వరకు పడొచ్చని అంచనావేశారు.