సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పై మరో కేసు నమోదు అయింది. అనకాపల్లిలో ఆర్జీవీపై కేసు నమోదు చేసిన రావికమతం పోలీసులు ఈరోజు (నవంబర్ 21న) విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.
అయితే, ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలిపిన వర్మ.. విచారణకు మరో వారం రోజుల సమయం కోరినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కూడా ఆర్జీవీ షూటింగ్‌లో ఉన్నారా.. లేదా అనే కోణంలో విచారిస్తున్నారు. మరి ఈ కేసు విచారణకైనా ఆర్జీవీ అటెండ్ అవుతారో లేదో చూడాలి.
Also Read :- పుష్ప గాడి ప్రభంజనానికి రంగం సిద్ధం
వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో చంద్రబాబు, పవన్, నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ పోస్టులు పెట్టడంతో.. ఇటీవలే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత గడువు ఇవ్వాలని ఆర్జీవీ పోలీసులను రిక్వెస్ట్ చేశారు.
ఆర్జీవీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. 2024, నవంబర్ 25వ తేదీన విచారణకు హాజరు కావాలని బుధవారం (నవంబర్ 20) మరోసారి రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపారు. ఈ మేరకు ఆర్జీవీ వాట్సాప్ నెంబర్‌కు నోటీసులు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపి.. విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. దీంతో ఆర్జీవీ ఈ సారైనా విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.