40 కిలోల గంజాయి పట్టివేత, నలుగురు అరెస్ట్

40 కిలోల గంజాయి పట్టివేత, నలుగురు అరెస్ట్

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో రూ.80 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు ఆటోలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. దాదాపు 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటోని సీజ్ చేసి, వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు నిఘా పెడుతున్నా గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో  గంజాయిని సాగుచేసి… ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టుగా సమాచారం. ఈ గంజాయి ని ఏ ప్రాంతానికి తరలిస్తున్నారనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.