- మిస్ యునైటెడ్ కాంటినెంట్స్‌గా కొలంబియా అమ్మాయి
ఐదు ఖండాలకు సుందరిగా కొలంబియా అమ్మాయి నిలిచింది. మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. శనివారం ఈక్వెడార్‌లోని గయాక్విల్‌లో జరిగిన పోటీల్లో అనైరిస్ కెడావిడ్ అనే అమ్మాయి ఆ కిరీటాన్ని దక్కించుకుంది. గత ఏడాది మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ విన్నర్ అయిన మెక్సికోకు చెందిన ఆండ్రీ సాయింజ్ ఆమెకు కిరీటం అలంకరించింది. ఐదు ఖండాల పోటీ దారులు ఆమెకు అభినందనలు తెలిపారు.

