మియాపూర్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య....

హైదరాబాద్ లోని మియాపూర్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని హఫీజ్ పెట్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. శనివారం ( జనవరి 4, 2025 ) చోటు చేసుకున్న ఈ గహట్ఠానకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ లో శనివారం అర్ధ రాత్రి వ్యక్తి పై సిమెంట్ ఇటుకలతో  తల పై మొది హత్య చేసినట్లు తెలిపారు పోలీసులు.

స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.హత్య కు గురైన వ్యక్తి వయసు సుమారుగా 30-35 సంవత్సరాలు ఉంటాయన్న తెలిపారు పోలీసులు.క్లూస్ టీం తో వివరాలు సేకరించి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. హత్యకు గల కారణాలు వంటి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.