బస్సులోనే సీఎం జగన్‌కు చికిత్స.. యాత్ర కొనసాగింపు

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాయి విసిరాడు. ఈ దాడిలో ముఖ్యమంత్రి జగన్ ఎడమ కంటికి గాయమైంది. కనుబొమ్మకు రాయి తాకి కన్ను వాచింది. వెంటనే డాక్టర్లు బస్సులోనే జగన్‌ గాయానికి ట్రీట్మెంట్ చేశారు. ఆయనతో పాటు ఉన్న వెల్లపల్లి కంటికి కూడా రాయి తగిలింది. ఘటనా స్థలంలోని సీసీపుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. చికిత్స అనంతరం జగన్ యాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ పైకి ఓ అగంతకుడు రాయిని విసిరాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి పూలతో పాటుగా రాయిని కూడా జగన్ పైకి విసిరాడు. రాయి ఫోర్స్ గా జగన్ కు తగలడంతో ఎడమ కన్ను కొద్దిగా వాచింది.