మన జీవితాలు ఎప్పుడూ ఏడుపే.. మన కంటే పాకిస్తాన్ వాళ్లే హ్యాపీ అంట..!

అంటే ప్రతోడికీ పౌరుషాలు వస్తాయి.. అంతెత్తున లెగుస్తారు.. ఇదంతా ఎందుకు అంటారా.. ప్రపంచ వ్యాప్తంగా హ్యాపీగా ఉన్న దేశాల జాబితాను రిలీజ్ చేస్తే.. అందులో మన భారతదేశం స్థానం ఎక్కడో తెలుసా.. అక్షరాల 126వ స్థానం.. 126 అంటే పెద్దది కాదు ఇక్కడ.. తక్కువ అని.. అంటే మన భారతీయులు హ్యాపీగా లేరు.. ఎప్పుడూ ఏడుస్తూనే ఉన్నారు.. ఉంటారా.. హ్యాపీ అంటే మన భారతీయులకు తెలియదా..

మరో విశేషం ఏంటో తెలుసా.. మన పక్కనే ఉన్న.. మనల్ని నిత్యం ద్వేషించే పాకిస్తాన్లోని ప్రజలు మన కంటే హ్యాపీగా ఉన్నారంట.. అవును.. హ్యాపీ ఇండెక్స్లో మన స్థానం 126 అయితే.. వాళ్లది 108వ స్థానం.. మన కంటే బెటర్ హ్యాపీగానే ఉన్నారు పాకిస్తానీయులు.. యుద్ధంతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్ జనం కూడా మన కంటే హ్యాపీగానే ఉన్నారు.. నియంత పరిపాలన అంటున్న మయన్మార్ దేశంలోని జనం కూడా మన ఇండియా జనం కంటే హ్యాపీగానే ఉన్నారు.. వాళ్లది 118వ ర్యాంక్ అయితే.. మనది 126వ ర్యాంక్ కదా.. హ్యాపీలో మనం ఎవరితో పోటీ పడుతున్నామో తెలుసా.. ఆప్ఘనిస్తాన్.. నోరెళ్లబెట్టొద్దు.. అవాక్కవ్వొద్దు.. ఇది నిజం.. పచ్చి నిజం..

Also Read:-బ్యాచిలర్ రూంకి వాస్తు ఉంటదా.. 

అసలు మన దేశంలో ప్రజలు ఎందుకు హ్యాపీగా లేరని నిశితంగా గమనిస్తే.. స్వార్థం, ఈజీ మనీ కోసం వెంపర్లాట, పక్కనవాళ్ల జీవితాలపై పడి ఏడవడం, ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందోననే భయం, ఉద్యోగాల కొరత, ప్రోత్సహించే వాళ్ల కంటే నిరుత్సాహపరిచే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఆదాయ అసమానతలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు, సామాజిక అసమానతలు, నలుగురూ ఏమనుకుంటారోననే ఆలోచన.. ఇలా పలు అంశాలు ఇండియాలోని జన జీవనానికి సంతోషాన్ని దూరం చేస్తున్నాయి. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బతికే జీవితాలుగా ఇండియన్స్ లైఫ్ స్టైల్ ను మార్చేశాయి.

ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ప్రతి నిత్యం యుద్ధంతో, బాంబుల మోతతో వణికిపోతుండే యూరప్ దేశాల్లోని ప్రజలు ఇండియాతో పోల్చుకుంటే హ్యాపీగా బతికేస్తున్నారు. World Happiness Report 2024లో ఇజ్రాయెల్ 5వ స్థానంలో ఉంది. 2021 నుంచి 2023 వరకూ ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితులను, ప్రజల జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని మూడేళ్ల యావరేజ్ రిపోర్ట్ను ప్రకటించారు. వరుసగా 7వ సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా, ఆనందకరంగా జీవిస్తున్న దేశాల్లో టాప్లో నిలిచింది.

ప్రపంచ దేశాలన్నింటిలో.. ఆఫ్ఘనిస్తాన్ అత్యంత అసంతృప్తితో, శోకంలో మునిగిపోతూ బతికే ప్రజలు ఉండే దేశంగా అట్టడుగున నిలిచి 143వ ర్యాంక్ లో కొనసాగుతోంది. ఇండియా ర్యాంక్ 2023లో 126, 2024లో కూడా ఏమాత్రం మార్పు లేదు. దేశ ప్రజల్లో అదే అసంతృప్తి, అదే ఆవేదన, అవే ఆక్రందనలు, అవే ఆర్తనాదాలు. అంబానీలు, అదానీలు బతికే ఈ దేశంలో కొందరు మాత్రమే సంతోషంగా బతుకుతున్నారు. మెజార్టీ ప్రజలు అసంతృప్తితో బతుకీడుస్తున్నారు.