కొండపోచమ్మ ఆలయం వద్ద బహిరంగ వేలం పాట

  • అమ్మవారి ఆలయానికి వార్షిక ఆదాయం రూ.43.71లక్షలు

జగదేవపూర్,వెలుగు: కొండపోచమ్మ ఆలయం వద్ద దుకాణాల బహిరంగ వేలంపాట నిర్వహించారు.  ఈఓ రవికుమార్, ఆలయ పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం బహిరంగ వేలం పాట పాడారు.  కొబ్బరి కాయలు, అమ్మవారి ఓడిబియ్యం, దుకాణాలనెల వారి కిరాయికి వేలంపాట నిర్వహించారు. బహిరంగ వేలంలో కొబ్బరి కాయలు, పూజా సామగ్రిని రూ.18 లక్షలకు గురువన్నపేటకు చెందిన లావణ్య రమేశ్, అమ్మవారి ఓడిబియ్యంను రూ.17.27లక్షలకు చాట్లపల్లికి చెందిన అశోక్, కొబ్బరి ముక్కలను  రూ.5.61 లక్షలకు తిగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన కె.భాను, షాపు నెంబర్-2ను నెలకు రూ.17,500 కు గురువన్నపేటకు చెందిన బచ్చలి కిశోర్, దుకాణం నెంబర్ -5ను తిగుల్ నర్సాపూర్ కి చెందిన బచ్చలి కిశోర్, తడకల పందిరి రూ.95 వేలకు మర్పడ్గకు కు చెందిన నర్సింలు  దక్కించుకున్నారు. 

20 డిసెంబర్20024 నుంచి 20 డిసెంబర్ 2025 వరకు వేలం దక్కించుకున్న వారికే అమ్ముకునే అవకాశం ఉంటుందని ఈఓ రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో బుగ్గ రాజరాజేశ్వరీ టెంపుల్ సూపర్ వైజర్ శ్రీధర్ రెడ్డి, సిద్దిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ సూపర్ వైజర్ చంద్రకుమార్, సిద్దిపేట హనుమాన్ టెంపుల్ సూపర్ వైజర్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.