వైజాగ్ వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. 10 నాన్ బెయిలబుల్ సెక్షన్స్

విశాఖ: విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఊహించని షాక్‌ తగిలింది. ఆయనపై ఆరిలోవ పోలిస్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నెల 22న విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఆడిటర్ జీవి లపై ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హయగ్రీవ భూముల వ్యవహారంలో ఫిర్యాదులు ఆధారంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఎఫ్ఐఆర్ నెంబర్ 227/2024 కింద 10 నాన్ బెయిల బుల్ సెక్షన్లు పెట్టారు పోలీసులు. దీంతో వెంటనే హై కోర్టులో స్క్వాష్ పిటీషన్ వేశారు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ.