వైజాగ్ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తాం: దక్షిణ కొరియా నుంచి ఎల్జీ పాలిమర్స్ ప్రత్యేక బృందం

వైజాగ్ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తాం: దక్షిణ కొరియా నుంచి ఎల్జీ పాలిమర్స్ ప్రత్యేక బృందం

వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు  ‘ఎల్జీ పాలిమర్స్’ కూడా సిద్ధమైంది. ఇందుకోసం 8మంది దక్షిణకొరియా నుంచి ఓ ప్రత్యేక బృందం భారత్ కు బయలుదేరిందని..వారిలో ఎల్జీ పెట్రో కెమికల్ విభాగం అధినేత నేతృత్వంలో దర్యాప్తు చేపట్టే ఈ ప్రత్యేక బృందం సభ్యులు ఉన్నారంటూ నోట్ ను విడుదల చేసింది.  ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా దక్షిణ కొరియా బృందం భేటీ కానున్నట్టు సమాచారం. పరిశ్రమలో స్టిరీన్ గ్యాస్ లీకేజ్ కు గల కారణాల విశ్లేషణతో పాటు, గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం వివరించనుంది.