కరీంనగర్ సిటీ, వెలుగు: అంబేద్కర్, రాజ్యాంగం గురించి అమర్యాదగా మాట్లాడిన కేంద్రమంత్రి అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఇందిరా చౌక్ వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ నిర్వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు పురుమళ్ల శ్రీనివాస్, వొడితల ప్రణవ్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, లీడర్లు అంజన్ కుమార్, పద్మాకర్ రెడ్డి, రహమత్ హుస్సేన్, సమద్ నవాబ్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్, వెలుగు: భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తికి అంబేద్కర్ దేవుడని అలాంటి గొప్ప వ్యక్తిని చులకనగా మాట్లాడిన అమిత్ షా ను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నరసింగరావు, మహిళా, యూత్ కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.