సముద్రంలో పేలిపోయిన ఆయిల్ ట్యాంకర్

సముద్రంలో పేలిపోయిన ఆయిల్ ట్యాంకర్

చెన్నై నౌకాశ్రయంలో శుక్రవారం (నవంబర్ 10న) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నౌకలోని ఆయిల్‌ ట్యాంకర్‌కి మరమ్మత్తులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

కార్మికులు గ్యాస్ కట్టర్‌ని ఉపయోగిస్తుండగా పేలుడు సంభవించింది. అక్టోబర్‌ 30వ తేదీన చెన్నై పోర్ట్ కాంప్లెక్స్ లోని కోస్టల్ వర్క్ ప్రాంతానికి రిపేర్ పనుల కోసం ఒడిశాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ను తీసుకొచ్చారు. ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హార్బర్‌ పోలీసులు తెలిపారు.

చెన్నై - ఒకప్పుడు భారతదేశ తూర్పు తీరంలో చమురు ఉత్పత్తికి కేంద్ర బిందువు - ఇటీవల అదానీ గ్రూప్ యాజమాన్యంలోని కొత్త ప్రైవేట్ టెర్మినల్స్ ఆవిర్భావంతో మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. ముఖ్యంగా నష్టాలను చవి చూసిన దాంట్లో కట్టుపల్లి పోర్టు ఉంది.