పెద్దపల్లి జిల్లా: సింగరేణి గనిలో బుధవారం మట్టి కూలి ఇద్దరు కార్మికులు చనిపోయారు. రామగిరి మండలంలోని ఆర్ జీ 3 పరిదధిలోని ఒసిపి 2గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. వాటర్ పైప్ లైన్ కు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి కుప్పకూలి కార్మికులపై పడింది.
ఆ సమయంలో సంఘటన స్థలంలో నలుగురు కార్మికుల విధులు నిర్వహిస్తున్నారు. కూలిన మట్టి పెళ్లలు పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు కార్మికులు స్వల్ప గాయలతో బయట పడ్డారు. మృతి చెందినవారు నిప్పు వెంకటేశ్వర్లు (ఫిట్టర్), విద్యాసాగర్ (జనరల్ మజ్దూర్) లు గా గుర్తించారు. మృతదేహాలను గోదావరిఖని సింగరేణి హాస్పిటల్ కు తరలించారు. గాయాలపాలైన వారికి చికిత్స అందిస్తున్నారు.