ఏపీలో అమృతాంజన్ స్టోర్​

హైదరాబాద్​, వెలుగు: హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, వెల్నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్టుల తయారీ సంస్థ అమృతాంజన్ ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తమ మొదటి ఫిజికల్ స్టోర్ 'వరల్డ్ ఆఫ్ అమృతాంజన్'ని ప్రారంభించినట్లు ప్రకటించింది.  ఇది వరకే చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్టోర్లను తెరిచినట్టు సంస్థ తెలిపింది. విజయవాడ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెయిన్ బామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, స్ప్రెలు, రోలాన్లు,  తలనొప్పి, ఒళ్ళు నొప్పులకు ప్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో సహా పెయిన్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఉత్పత్తుల పూర్తి శ్రేణి ఉంటుంది.  కోల్డ్ రబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, నాజల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హేలర్లు,  దగ్గు సిరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూ కొనుక్కోవచ్చు.