అమ్రాబాద్ ఏజెన్సీ పోలింగ్ కేంద్రాల తనిఖీ

అమ్రాబాద్, వెలుగు: ఏజెన్సీలోని పోలింగ్  కేంద్రాలను శుక్రవారం కలెక్టర్  ఉదయ్ కుమార్  పరిశీలించారు. అమ్రాబాద్  మండలం పరహాబాద్, కుడిచింతల బయలు, సార్లపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, కరెంట్  తదితర సౌలతులు కల్పించాలన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.