హెల్త్ కేర్ పోర్టల్ ను స్టార్ట్ చేసిన బిగ్​బీ మనవరాలు

హెల్త్ కేర్ పోర్టల్ ను స్టార్ట్ చేసిన బిగ్​బీ మనవరాలు

న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా తన సొంత వ్యాపార సంస్థను ప్రారంభించారు. ‘‘ఆరా హెల్త్’ పేరిట ఆన్‌లైన్ హెల్త్‌కేర్ పోర్టల్ ను స్టార్ట్ చేశారు. నవ్వ నవేలి అమితాబ్ బచ్చన్ తనయురాలు శ్వేతాబచ్చన్‌ నందా కూతురు. న్యూయార్క్ లోని ఫోర్డ్‌హామ్ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె తాన్ స్టార్టప్ ని ఓపెన్ చేసిన విషయం ఇన్​స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ‘‘మహిళల హెల్త్ కేర్, ఆరోగ్య సమస్యలను గుర్తించి అవగాహన కలిగించడమే ఈ వేదిక లక్ష్యం”అని క్యాప్షన్ ఇచ్చారు. నవ్య స్టార్ట్ చేసిన కొత్త స్టార్టప్ లో ఆమెతోపాటు సభ్యులుగా అహిల్య, మెహతా, మల్లికా సాహ్నీ, ప్రజ్ఞ సాబూలు ఉన్నారు. ‘మేము ఒక సాధారణ సమస్యను పరిష్కరించడానికి కలిసి వచ్చిన స్వతంత్ర యువతులం. మా మా విభిన్న నేపథ్యాలు, భావాలే ఇతర మహిళలను శక్తివంతం చేయాలనే స్ఫూర్తినిచ్చాయి.. అంటూ ఇన్‌స్టా షేర్‌ చేశారు. నవ్య కొత్త వెంచర్‌ను ఆమె తల్లి శ్వేతా బచ్చన్ ప్రమోట్‌ చేస్తూ.. ‘ధైర్యవంతమైన యువతులు… ఇప్పటి నుంచి ఎప్పటికీ’ అని కామెంట్ చేశారు.