స్పెషల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటుడిగా బిగ్ బీ

స్పెషల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటుడిగా బిగ్ బీ

ముంబై: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ అఛీవర్స్ (ఎఫ్‌‌ఐఏఎఫ్) అవార్డుకు అమితాబ్ ఎంపికయ్యారు. వర్చువల్‌గా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ మార్టిన్ స్కోర్సెసె, క్రిస్టోఫర్ నోలన్‌‌లు బిగ్ బీని అవార్డుతో సత్కరించారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా అమితాబ్ అరుదైన ఫీట్‌‌ను అందుకున్నారు. భారతీయ సినిమాను ముందుకు తీసుకెళ్లడంతోపాటు కళామతల్లికి అందిస్తున్న సేవలకు గాను అమితాబ్‌‌ను ఈ అవార్డు వరించింది. డైరెక్టర్, ఫిల్మ్ ఆర్చివిస్ట్, రీస్టోరర్ అయిన శివేంద్ర సింగ్ దుంగార్పూర్.. బిగ్ బీని ఈ అవార్డుకు నామినేట్ చేశారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్‌‌ సంస్థాపకుల్లో శివేంద్ర సింగ్ ఒకరు కావడం గమనార్హం. ఈ ఫౌండేషన్‌‌కు ఫెడ్రిక్ మేరీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.