KBC: కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌పై రూ.6.4 లక్షల ప్రశ్న.. కోహ్లీని గుడ్డిగా నమ్మిన ఆడియన్స్

కౌన్ బనేగా కరోడ్‌పతిలో కంటెస్టెంట్ కు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ షో కు హోస్ట్ చేస్తున్నారు. రూ. 6.4 లక్షల ప్రశ్నగా కంటెస్టెంట్ కు. "2024 లో సునీల్ గవాస్కర్ తర్వాత టెస్ట్ సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారతీయుడు ఎవరు?" అని అడిగారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, రోహిత్ శర్మ రూపంలో నాలుగు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. 

పోటీదారుడికి సమాధానం గురించి ఖచ్చితంగా తెలియదు. దీంతో అతను ప్రేక్షకుల పోల్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ పోల్ లో 37% మంది కోహ్లీకి.. 49% మంది జైస్వాల్‌కు ఓటు వేశారు. 4 % గిల్ కు 10% రోహిత్ కు ఓటు వేశారు. దీనికి సరైన సమాధానం జైశ్వాల్. ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో గైక్వాడ్ 5 టెస్టుల సిరీస్ లో ఏకంగా 712 పరుగులు చేసి గవాస్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్ గా నిలిచాడు. 

Also Read : 150 కి.మీ వేగం వచ్చేస్తుంది

ఈ పోల్ లో ఆశ్చర్యకరంగా కోహ్లీకి 37 శాతం ఆడియన్స్ ఓట్లు వేశారు. విశేషమేమిటంటే కోహ్లీ ఈ సిరీస్ లో ఆడలేదు. వ్యక్తిగత కారణాల వలన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ ఏడాది అతను ఇటీవలే బంగ్లాదేశ్ తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్ లో మాత్రమే ఆడాడు. అయితే ఆడియన్స్ మాత్రం గుడ్డిగా కోహ్లీని నమ్మి కంటెస్టెంట్ ను కన్ఫ్యూషన్ కు గురి చేశారు. ఈ షో లో ఈ మధ్య క్రికెట్ కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు.