అమిత్​ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: సింహాద్రి

ముషీరాబాద్, వెలుగు: పార్లమెంటులో అంబేద్కర్‎పై కేంద్ర హోంమంత్రి అమిత్​షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. అంబేద్కర్‎ను అవమానిస్తే.. రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని, వెంటనే దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని పార్టీ ఆఫీసులో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పదేండ్లుగా రాజ్యాంగాన్ని బలహీన పరుస్తూ ఎన్నో చట్ట ఉల్లంఘలకు పాల్పడుతోందని మండిపడ్డారు.