న్యూఢిల్లీ: హత్రాస్, బల్రామ్పూర్ గ్యాంగ్ రేప్ ఘటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఘటనలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్న సమయంలో ఇలాంటి మరో గ్యాంగ్ రేప్ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. గురుగ్రామ్‌లో ఓ 25 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాల్ గర్ల్ అయిన ఆ మహిళతో నిందితుల్లో ఒకతను ఒప్పందం చేసుకున్నాడు. సికిందర్ పూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆమెను కలుసుకున్న నిందితుడు డీఎల్ఎఫ్ ఫేజ్-2లోని ప్రాపర్టీ డీలర్ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే మరో ముగ్గురు వేచి ఉన్నారు. వారిని చూసిన బాధితురాలు అక్కడి నుంచి పారిపోవడానికి యత్నించింది. అది గమనించిన నిందితులు ఆమెను లాక్కెళ్లారు. బాధితురాలు ప్రతిఘటించినా వదలని కిరాతకులు ఆమెను కొడుతూ హింసించడంతోపాటు తలను గోడకేసి బాదారు. ఆ తర్వాత అత్యాచారం చేసి పారిపోయారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు. నిందితులను రంజన్ (23), పవన్ (24), పంకజ్ (26), గోబింద్ (20)గా గుర్తించారు. నిందితుల్లో ఒకడైన రంజన్ ప్రాపర్టీ డీలర్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడని, మిగిలిన ముగ్గురు ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా వర్క్ చేస్తున్నారని తెలిసింది.
