నీళ్ల కష్టాలు.. బురద నీటిని వడపోసి తాగుతున్నారు

నీళ్ల కష్టాలు.. బురద నీటిని వడపోసి తాగుతున్నారు

నీళ్లు లేనిదే ఏ పని చేయలేము. నీళ్లు లేని ప్రపంచాన్ని ఊహించలేము. తాగు, సాగు, నిత్యావసరాలు తీర్చుకోవడానికి నీరే ప్రథమ స్థానంలో ఉంటుంది. మనిషి.. నీరు చట్టూనే తిరుగుతుంటుంది. కానీ.. ఎండకాలం వచ్చిందంటే.. చాలు నీరు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. బొట్టు బొట్టు నీటిని ఒడిసి పట్టుకుంటుంటారు. గుక్కెడు నీటి కోసం పడరాని కష్టాలు పడుతుంటారు. కనీసం నోరు తడుపుకోవడానికి కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతుంటారు. ప్రధానంగా ఈ పరిస్థితి రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అక్కడ నీటి చుక్క కోసం జనాలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇటీవలే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రాణాలకు తెగించి.. ఓ బావిలో నీటిని తోడుకుంటున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే మరొకటి బయటకు వచ్చింది. 

నాసిక్ గ్రామంలో తీవ్రమైన నోటి సంక్షోభం నెలకొంది. మహిళలు నీళ్లు తెచ్చుకోవడానికి కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళుతున్నారు. అవి స్వచ్ఛమైన నీళ్లా అంటే కావు. బురద నీటిని బట్టలో వడపోసి తీసుకొని వెళుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లోతైన బావిలో ఓ వ్యక్తి దిగగా.. పైన ఉన్న వాళ్లు తాళ్ల సహయంతో కిందకు బిందెలు, చిన్నపాటి ప్లాస్టిక్ డ్రమ్ములను వదులుతుండడం కనిపిస్తోంది. పైకి లాగిన తర్వాత.. బుదర నీటిని వేరే దానిలో పోసుకుంటున్నారు. నెత్తిపై బిందెలను పెట్టుకుని.. సుమారు మూడు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ వెళుతున్నారు. నెటిజన్లు స్పందిస్తున్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం దారుణమని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
 

మరిన్ని వార్తల కోసం : -
యూపీ సీఎం యోగీకి ప్రధాని మోదీ బర్త్ డే విషెస్..


జమ్మూ కశ్మీర్ దాడులకు నిరసనగా ఆప్ నిరసన