ప్రైవేట్​​కు  దీటుగా ఫలితాలు సాధించాలి : చైర్మన్​ పాండురంగారెడ్డి

  • అమీన్​పూర్​ మున్సిపల్ చైర్మన్​ పాండురంగారెడ్డి

రామచంద్రాపురం (అమీన్​పూర్​) , వెలుగు: ప్రైవేట్​ స్కూల్స్​కి దీటుగా ప్రభుత్వ స్కూల్​స్టూడెంట్స్​ ఫలితాలు సాధించాలని అమీన్​పూర్​మున్సిపల్ ​చైర్మన్ ​పాండురంగా రెడ్డి అన్నారు. వీ ఫర్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న టెన్త్​ స్టూడెంట్స్​కు ఎగ్జామ్​ కిట్స్​అందజేశారు. ఈ సందర్భంగా పాండురంగా రెడ్డి మాట్లాడుతూ..  విద్యాభివృద్ధికి  స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఉచిత భోజనం, యూనిఫాంలు, ఫ్రీ బుక్స్​ను స్టూడెంట్స్​ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణ, కల్పన, చంద్రకళ, కో ఆప్షన్​ మెంబర్ రాములు, నాయకులు చంద్రశేఖర్, యాదగిరి, ఫౌండేషన్​ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, సభ్యులు మల్లికార్జున్, ప్రవీణ్​ పాల్గొన్నారు.