కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయం: అంబటి రాంబాబు

కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ ఓడిపోవడం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు తనపై  తప్పుడు ప్రచారం చేశారని..డబ్బుల కోసం తానెప్పుడు కక్కుర్తి పడలేదని విమర్శించారు. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం అవుతుందన్నారు. చంద్రబాబు ఓటమి భయంతో  ప్రస్టేషన్ లో ఉన్నారని చెప్పారు. 

పవన్ కు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు అంబటి రాంబాబు. పవన్ రెండు రోజులు ప్రచారం చేసి 5 రోజులు  పడుకుంటారని విమర్శించారు.  పవన్ కు రాష్ట్రం మొత్తం తిరిగే శక్తి లేదని చెప్పారు. సంక్రాంతి డ్యాన్సులు చేస్తే తప్పేంటన్నారు. పవన్ ,చంద్రబాబు ఇద్దరు పొలిటికల్ డ్యాన్సర్లేనని సెటైర్ వేశారు రాంబాబు. పొత్తు పెట్టుకోవడం అంటే సమాధి కట్టుకోవడమేనని మండిపడ్డారు.