ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓడినట్లే .. అంబటి

మంత్రి అంబటి రాంబాబు జనసేన, టీడీపీలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు ఎంత ప్రయత్నించినా కూడా తన విజయాన్ని అడ్డుకోలేవని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని, పవన్ డైలాగులు సినిమాల్లో వర్కౌట్ అవుతాయని, రాజకీయాల్లో పనికిరావని అన్నారు. తనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయని, వారు ఎంత ప్రయత్నించినా తన విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఒక్క ఓటు తగ్గినా కూడా తాను నైతికంగా ఓడినట్లే అని అన్నారు. 

సత్తెనపల్లి నుండి రెండుసార్లు పోటీ చేసిన అంబటి 2019 ఎన్నికల్లో 20వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి టీడీపీ తరఫున సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తుండటంతో హోరాహోరీ పోరు నెలకొంది. సత్తెనపల్లిలో నిర్వహించిన వైసీపీ సభతో పాటు టీడీపీ సభ కూడా సక్సెస్ అవ్వటంతో ఇరు పార్టీల నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ హోరాహోరీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.