మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతుండగా సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ ఘటన అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. ఈ దాడి వెనుక టీడీపీ కుట్ర దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుండగా, ఇదంతా వైసీపీ డ్రామా అని టీడీపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్నాత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై ప్రధాని మోడీ ఖండించారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం వెటకారం చేస్తున్నారని అన్నారు.
జగన్ సింపతీ కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని, ఆ అవసరం కూడా జగన్ కుడి లేదని. సంక్షేమ పథకాలే జగన్ ను గెలిపిస్తాయని అన్నారు అంబటి. జగన్ ను ఒంటరిగా ఎదుర్కునే దమ్ము లేకనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని అన్నారు. ముగ్గురు కలిసినా 30మంది కలిసినా జగన్ ను ఓడించలేరని అన్నారు అంబటి. టీడీపీ అశాంతిని సృష్టిస్తుందని, వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.