2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టడంతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. విమర్శ, ప్రతివిమర్శలతో నేతలంతా తగ్గేది లే అంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాలేరని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.
వాలంటీర్లకు 10వేలు ఇస్తానని అనటం చంద్రబాబు ఎలక్షన్ స్టంట్ లో భాగమేనని అన్నారు. ఈ దేశంలో చంద్రబాబు మాట ఎవరూ నమ్మరని అన్నారు. సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వటం ఖాయమని అన్నారు. నిన్నటి దాకా వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు ఒక్కరోజులోనే నాలుక మడతేసారని మండిపడ్డారు.