జగన్ ను చంపాలని చూస్తున్నారు..అంబటి

వైసీపీ అధినేత, సీఎం జగన్ పై రాయితో దాడి ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. దాడికి నిరసనగా విజయవాడలో నల్ల జెండాలతో ర్యాలీ చేపట్టారు వైసీపీ శ్రేణులు. ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై దాడి ముమ్మాటికీ టీడీపీ కుట్ర అని అన్నారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబే ఈ కుట్రకు ప్లాన్ చేశాడని అన్నారు. జగన్ ను ఎదుర్కునే దైర్యం లేక చంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఘటనపై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాయి కొంచెం కింద తగిలి ఉంటే జగన్ కంటికి గాయం అయ్యుండేదని,కణతకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం వచ్చి ఉండేదని అన్నారు.కాగా, ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దాడిపై సీరియస్ గా స్పందించిన ఈసీ ఇకపై కీలక నాయకుల సభలకు భద్రత పెంచాలని ఆదేశించింది. ఒక రాష్ట్ర సీఎం సభలో భద్రతా వైఫల్యం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.