పుష్ప 2 మూవీని ఏపీలో అడ్డుకోవటం ఎవరి వల్లా కాదు : మాజీ మంత్రి

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో పుష్ప 2 సినిమా పైన రాజకీయంగానూ చర్చ మొదలైంది. రిలీజ్ కాకుండా కొందరు ఆపేయాలని ప్రయత్నిస్తున్న వారికి.. వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పుష్ప 2 మూవీని అడ్డుకోవటం ఎవరి వల్లా కాదని అన్నారు.

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను చూడకుండా ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు.. రాజబాబు లాంటి కమెడియన్ సినిమాలు రిలీజ్ అయితేనే.. ప్రజలు చూసి హిట్ చేశారు. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఇంటర్నే షనల్ హీరోగా వస్తోన్న పుష్ఫ-2 అడ్డుకోవటం ఎవరి వల్లా కాదని.. అరచేతిని అడ్డు పెట్టుకొని సినిమా విజయాన్ని ఆపలేరని.. తాను కూడా సినిమా చూడటానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు.

ఇక గతంలోనూ  జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా అడ్డుకోవాలని చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ అదెవ్వరికీ సాధ్యపడలేదని గుర్తు చేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా పుష్ఫ-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అంబటి వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.