చంద్రబాబు పల్లకి మోసే దశకు పవన్ దిగజారాడు - అంబటి..!

టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించగానే అధికార వైఎస్సార్సీపీ నేతలు మూకుమ్మడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దాడి స్టార్ట్ చేశారు. సజ్జల మొదలుకొని మంత్రి రోజా, అంబటి రాంబాబు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పార్టీ పెట్టారని, జనసేన అధ్యక్షుడిగా కాకుండా టీడీపీ ఉపాధ్యక్షుడి పదవి తీసుకోవాలని అన్నారు సజ్జల. పవన్ పార్టీ ఎందుకు పెట్టాడో ఆయనకే తెలియదని కామెంట్ చేశారు మంత్రి రోజా.

చంద్రబాబు పల్లకి మోసే స్థాయికి పవన్ దిగజారడని అంబటి రాంబాబు అన్నారు. పల్లకి మోసి పరువు తీసుకోవటం కంటే పార్టీని విలీనం చేసి సినిమాలు తీసుకోవడం బెటర్ అని, పల్లకి మోయడానికి తప్ప, పావలా వంతుకు కూడా పనికి రావని తేల్చేశారనిట్వీట్లతో పవన్ ని టార్గెట్ చేశాడు అంబటి.